Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా మర్కుక్ మండల ఎంపిటిసి ఫోరం తాజా మాజీ అధ్యక్షులు రాజ బోయిన కృష్ణ యాదవ్, తాజా మాజీ సర్పంచ్ గాయత్రి బాల నర్సయ్య, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పత్తి బాబు, బిఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద కేకు కట్ చేసి బాణాసంచా పేల్చి మిఠాయి పంచుకొని, ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో కెసిఆర్ పాత్ర మరువలేనిదని, దశాబ్దాల స్వరాష్ట్ర ఆకాంక్షను, నెరవేర్చిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని, కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని భీమా వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు యువకులు, తదితరులు పాల్గొన్నారు