Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి17 :నిజామాబాదు జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో సోమవారం రోజునా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినము ఘనంగా నిర్వహించుకున్నారు. తరువాత మండల అధ్యక్షుడు ఏనుగందుల రాజాపూర్ణనందం ఆధ్వర్యంలో నాయకులు పార్టీ కార్యాలయంలో కేకు కటు చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో కెసిఆర్ చేసిన అభివృద్ధి పథకాలు మరువలేమని అని కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు యువకులు, తదితరులు పాల్గొన్నారు.