Listen to this article

జనంన్యూస్. నిజామాబాదు. ప్రతినిధి. 17 2025 నిజామాబాదు. జిల్లా. సిరికొండ మండలం.గడుకోల్ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం ఆoదడంతో సిరికొండ ఎస్సై ఎల్ రామ్.మరియు తన సిబ్బందితో కలిసి అట్టి అక్రమ ఇసుక రవాణాపై దాడి చేసి అక్రమంగా ఇసుక తరలిస్తున్న అటువంటి గడుకోల్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకా గౌడ్ కు సంబంధించిన ఒక జెసిబి మరియు రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి వాటిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణకై అట్టి వెహికల్స్ ని మైనింగ్ డిపార్ట్మెంట్కు అప్పగించడం జరిగింది ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసినట్లయితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అట్టి వెహికల్స్ ని సీజ్ చేసి మైనింగ్ అధికారులకు అప్పగించడం జరుగుతుందని సిరికొండ ఎస్ఐఎల్ రామ్ హెచ్చరించడం జరిగింది అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న కొంతమంది వ్యక్తులు ప్రొద్దున 5 గంటల నుంచి 8 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పోలీస్ వారి నిఘా తక్కువగా ఉంటుందని అనుకొని అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న కొంతమంది వ్యక్తులపై ప్రత్యేకంగా నిగా ఉంచి అట్టి అక్రమార్కులను పట్టుకొని వారిపై బలమైన కేసులు నమోదు చేస్తామని సిరికొండ ఎస్సై హెచ్చరించనైనది సిరికొండ మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ప్రాంతాలుగా కొండాపూర్ వాగు గడుకోలు వాగు ళ్లరామడుగు వాగు కొండూరు వాగు పెద్దవాలుగోటు వాగు చిన్న వాల్గోట్ వాగులు గుర్తించడం జరిగినది ఇట్టి వాటిపై పోలీసు వారు ప్రత్యేకమైన నిగా ఉంచి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.