Listen to this article

జనం న్యూస్ 18 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్జోగులాంబ గద్వాల్ జిల్లా: జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా లో ఆర్టిసి బస్సు ఆత్మకుర్ కు ఉదయం వెళ్లాల్సి ఉండగా గత రెండున్నర గంటల నుండి బస్సు లేదని పలువురు ఉద్యోగులు విద్యార్థులు ఆరోపించారు. ప్రతిరోజు వేళా పాలాలేని విధంగా ఆర్టిసి సిబ్బంది బస్సులు నడపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఆత్మకూర్ తో పాటు పలు రోడ్లలో బస్సులు సమయ వేళలు పాటించడం లేదని ప్రయాణికులు తీవ్రంగా ఆరోపి స్తున్నారు. ఉదయం 7 గంటలకు బయలుదేరిన బస్సు తిరిగి 9:30 కు ఉండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు 8 గంటలకు బస్సు ఉంటే బాగుండేదని ప్రయాణికులు కోరుతున్నారు. ఇంతేగాక నందిమల్ల నుండి ఆత్మకూరుకు వెళ్లే విద్యార్థులు బస్సు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తమకు సబ్జెక్టులు తప్పిపోతాయని విద్యలో వెనుకబడి పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమయానికి బస్సులు నడపాలని పరీక్షల సమయంలో బస్సులు నడపకుంటే తీవ్రంగా నష్టపోతామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్టీసీ అధికారులకు తెలియజేశారు. ప్రజలు అనేక బాధలు పడుతున్న ప్రభుత్వము ఏమి పట్టినట్లు నటిస్తూనే ఉంది ప్రజలకు ఇంత మోసం జరిగినా ఏ ప్రభుత్వము ఈ అధికారి ఎవరు స్పందించడం లేదు