Listen to this article

జనం న్యూస్. ఫిబ్రవరి 17. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) అసైన్డ్ భూములు. చెరువు. కుంటల. నుండి మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని సంగారెడ్డి జిల్లా ఆర్ డీ ఓ రవీందర్ రెడ్డి హెచ్చరించారు, సోమవారం హత్నూర తహసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదులు రావడంతో అధికారులను అడిగి అర తీశారు, అలాగే కార్యాలయంలో ప్రతి ఒక్క విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి జవాబుదారీ విధంగా ఉండాలని ఉద్యోగులను సూచించారు. భూ సమస్యలు గానీ విద్యార్థుల ఆదాయ ,కులదృవీకరణ , డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లన జారీ ఫక్రియాలో అలసత్వం వహించరాదని డిప్యూటీ తహసిల్దార్ దావూద్ అహ్మద్ కు సూచించారు, అనంతరం మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసిల్దార్ పర్వీన్ షేక్, ఆర్ఐ శ్రీనివాస్, కార్యాల సిబ్బంది ఉన్నారు,