

జనం న్యూస్ ఫిబ్రవరి 18 : నడిగూడెం మండలం లోని సిరిపురం,నారాయణపురం గ్రామాల మధ్య వెలసి ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి అనుబంధంగా ఇటీవల కల్యాణ మండపాన్ని నిర్మించారు. సిరిపురం గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసు-ప్రమీల దంపతుల ఆర్థిక సహకారంతో దీనిని నెలకొల్పారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈనెల 26న స్వామివారి కల్యాణాన్ని ఈ మండపంలోనే నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా దాతను భక్తులు అభినందించారు.