Listen to this article

జనం న్యూస్ 18 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఆంధ్ర ప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ నూతన డైరీని సోమవారం రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ ఎస్ వి ప్రసాద్ (శివ ) జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు.జర్నలిస్టులకు ఇళ్లు, ప్రమాద బీమా, అక్రిడిటేషన్లు అంశాలపై మంత్రికి వివరించగా సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీనివాస్ ఈ సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళతానని అతి త్వరలో ఈ సమస్యలు పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు, ఈ సందర్భంగా యూనియన్ మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కొండపల్లి కొండబాబు, సీనియర్ పాత్రికేయులు టి. రాధాకృష్ణ, అక్షరకెరటం సంపాదకులు కెజే శర్మ,భక్తిసమాచారం సంపాదకులు సముద్రాల నాగరాజు పాల్గొన్నారు.