

ప్రజా పంపిణీ వ్యవస్థ కార్యకలాపాలను సమర్ధవంతంగా నిర్వహించలి
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్
జనం న్యూస్ పీబ్రవరి 18: ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తో కలిసి పౌరసరఫరాల ఉపతహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ కార్యకలాపాలను జిల్లాలో సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు. రేషన్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, పి. డి. ఎస్. బియ్యం అక్రమంగా కొనడం, అమ్మడం చేసిన వారిపై పి. డి. ఎస్. కంట్రోల్ ఆర్డర్ 2016 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యాన్ని అందిస్తుందని, రేషన్ కార్డు దారులు ఈ బియ్యాన్ని కుటుంబ అవసరాల కోసం వినియోగించాలని, విక్రయించకూడదని తెలిపారు. ఎవరైనా పి. డి. ఎస్. బియ్యం అక్రమంగా కొనుగోలు, విక్రయించినట్లు గుర్తించినట్లయితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వారి రేషన్ కార్డు తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జనం న్యూస్ పీబ్రవరి 18 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తో కలిసి పౌరసరఫరాల ఉపతహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ కార్యకలాపాలను జిల్లాలో సమర్ధవంతంగా ర్వహించాలని తెలిపారు. రేషన్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, పి. డి. ఎస్. బియ్యం అక్రమంగా కొనడం, అమ్మడం చేసిన వారిపై పి. డి. ఎస్. కంట్రోల్ ఆర్డర్ 2016 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యాన్ని అందిస్తుందని, రేషన్ కార్డు దారులు ఈ బియ్యాన్ని కుటుంబ అవసరాల కోసం వినియోగించాలని, విక్రయించకూడదని తెలిపారు. ఎవరైనా పి. డి. ఎస్. బియ్యం అక్రమంగా కొనుగోలు, విక్రయించినట్లు గుర్తించినట్లయితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వారి రేషన్ కార్డు తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.