Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 18: కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బాలానగర డివిజన్ పరిధిలోని వినాయక నగర్ లో ఓంశాంతి బ్రహ్మకుమారీస్ వారి ఆధ్వర్యంలో 89వ.అవతరణ మరియు శివజయంతి ఉత్సోవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి విచ్చేసి ఓంశాంతి చెండా ఎగురవేసి సభ్యులతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మెడిటేషన్ తో ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతూ జీవశక్తిని పెంచి భావోద్వేగాలకు చలించకుండా మరింత ఆనందంగా ఉండేలా చేస్తుందని తెలిపారు అలాగే బ్రహ్మకుమారీస్ సంస్థ వారు శివరాత్రి దర్బంగా ప్రతియేటా ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తునందుకు వారికి అభినందనీయం అని తెలుపుతు నావంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుంది కార్పొరేటర్ తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ కుటుంబసభ్యులు బీకే సరోజ దీదీజీ చీఫ్ హెడ్ యస్ ఆర్ నగర్,బీకే జ్యోతి సిస్టర్ వినాయక నగర్ ఇంచార్జి,బీకే మాధవీ బాలానగర్ బ్రాంచ్ ఇంచార్జి తో పాటు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు .