Listen to this article

జనం న్యూస్ జనవరి 10 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్ )జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి గ్రామపంచాయతీ గుంతపల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుండి ఉత్తర ద్వార ప్రవేశం ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు పెద్ద ఎత్తున భక్తులు హాజరై శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో దేవుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పెనుగొండ నియోజకవర్గం సమన్వయకర్త ఉషశ్రీ చరణ్ హాజరై దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆమెకు ఆలయ కమిటీ ద్వారా తీర్థ ప్రసాదాలు అందజేశారు మంత్రి ఉషశ్రీ చరణ్ వెంట మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు