Listen to this article

జనం న్యూస్ 10 జనవరి కోటబొమ్మాళి మండలం: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్దికి ప్రణాళికలు తయారు చేసుకోవాలని మండల విస్తరణ అధికారి జే. అనందరావు అన్నారు. శుక్రవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో మండల కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్యం, మురికి కాలువలు శుభ్రపర్చుట, ఉపాధిహామీ పనులు పరిశీలన, వెలుగు మహిళలతో సంఘటితంగా తయారు చేసుకోవాలని ఆయన అన్నారు. గ్రామాల పరిశుభ్రతకు నిత్యం పరిశీలన, ఉపాధిహామీ వేతన దారులకు ప్రభుత్వం నిర్ధేశించిన వేతనాలు అందుతున్నవి, లేనిది అడిగితెలుసుకోని వారికి సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శుల సంఘం అద్యక్షుడు డి. బాలక్రిష్ణ, ఎన్‌. నరేష్‌, వి. రమేష్‌ తదితరులు ఉన్నారు.