Listen to this article

జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో. గ్రామపంచాయతీకి సమీపమున ఏర్పాటుచేసిన శివాజీ విగ్రహమునకు నేడు అనగా బుధవారం రోజున చత్రపతి శివాజీ మహారాజ్ . 395.వ జయంతిని పురస్కరించుకొని. గ్రామంలోని యువకులు. పెద్దలు రాజకీయ పార్టీలకు అతీతంగా. అందరూ కలిసి శివాజీ మహారాజ్ కు. పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున జై శివాజీ జై శివాజీ అంటూ నినాదాలతో. గ్రామం మొత్తం. మారుమోగింది. గ్రామంలోని యువకులంతా ఐక్యతగా కలిసిమెలసి చత్రపతిశివాజీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచి పెట్టారు.