

జనం న్యూస్ జనవరి 11 ( అల్లూరి జిల్లా ) : బొర్రా గుహలు పరిసరాల ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలని ఎంపీడీవో ఏవివి కుమార్ శుక్రవారం పర్యటించి సూచనలు ఇచ్చారు. 12 తారీకున అరకులోయ, అనంతగిరి, బొర్ర గుహలు,
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పర్యటన ఉందని తెలిపారు. పంచాయతీ సెక్రటరీ ధర్మకు పరిసరాల ప్రాంతం ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు లేకుండా పరిశుభ్రంగా ఉండేటట్లుగా అదనపు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని ఆదేశించారు.వారితో వారితో విస్తరణ అధికారి లాలం సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.