Listen to this article

జనం న్యూస్ 19 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) బుధవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు బావుపేట్ నుండి దండేపళ్లి గ్రామానికి పెట్రోలింగ్ చేస్తుండగా మానేరు వాగు వీనవంక నుండి రెండు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా బావుపేట బ్రిడ్జి దగ్గరలోకి రాగ పోలీస్ లు వారిని చూసి వారు పారిపోతుండగా వారిని పట్టుకోగా వారి పేర్లు ఎండి గౌస్ S/o యాకూబ్ R/o వీణ వంక 2) దాసరపు రాకేష్ s/o ఎల్లయ్య R/o వీణ వంక అని వారు ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా వారిని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి వారిపై కేసు నమోదు చేయనైనది. పెట్రోలింగ్ పార్టీ వారు హెడ్ కానిస్టేబుల్ సారంగపాణి,పీ సీ బక్కయ్య ,పీసీ భాస్కర్ రెడ్డి, హెచ్ జి, వీరస్వామి, ఉన్నారు