Listen to this article

జనం న్యూస్ //ఫిబ్రవరి //20//జమ్మికుంట //కుమార్ యాదవ్.. హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పిటిసి సభ్యులు ఆనందం రాజ మల్లయ్య, వయసు 60, బుధవారం సాయంత్రం తన స్వగృహంలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి హయాంలో టిడిపి పార్టీ తరఫున జడ్పీసీగా గెలుపొంది, మండల వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న రాజకీయ నేత, తెలంగాణ ఉద్యమంలో తరచు చురుకుగా పాల్గొన్నారు. తన వంతు తెలంగాణ ఉద్యమ సమయంలో భాగస్వామ్యుడు అయినాడు. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుని చనిపోవడం దురదృష్టకరమంటూ మిత్రులు,సన్నిహితులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బంధువులు కన్నీటి పర్యంతామయ్యారు. కాగా ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.