Listen to this article

ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి..

జనం న్యూస్ //ఫిబ్రవరి //20//జమ్మికుంట //కుమార్ యాదవ్.. పట్టబద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉందని, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని పరకాల శాసనసభ్యులు,హుజురాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి,రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.గురువారం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో…భాగంగా కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్స్ గ్రామ ఇన్చార్జిల మరియు ముఖ్య నాయకులు సమీక్ష సమావేశం కమలాపూర్,ఇల్లందకుంట, జమ్మికుంట,మండలా లో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో, నిర్వహించగా కార్యక్రమానికి పరకాల సనసభ్యులు, పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జ్ , రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఉట్కూరి నరేందర్ రెడ్డి గెలుపునకై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశా, నిర్దేశం చేశారు.అలాగే 50 ఓటర్స్ కి ఒకరు ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకొని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కు కృషి చేయాలి అన్నారు. ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇప్పటికే 55వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేసిందని, పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు.ఈ ర్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.