Listen to this article

జనం న్యూస్ 20 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా సబ్ టైటిల్:- బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవడంతో బ్రెయిన్ ఆపరేషన్ చేసిన వైద్యులు కర్నూల్ మెడికవర్ హాస్పటల్లో కోమాలో ఉన్న అంగన్వాడీ టీచర్ జి కవిత దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబం గద్వాల సినిమా థియేటర్లో ఆపరేటర్ గా పని చేస్తున్న శ్రీను భార్య జి కవిత అంగన్వాడి టీచరు జోగులాంబ గద్వాల జిల్లా: ఫిబ్రవరి 17న గద్వాల సినిమా థియేటర్లో పనిచేస్తున్నటువంటి ఆపరేటర్ శ్రీను ఇతని భార్య జి. కవిత గద్వాల నుంచి ఆత్మకూరు కు బైకుపై వెళుతుండగా శెట్టి ఆత్మకూర్ దాటిన తర్వాత కుక్క అడ్డం రావడంతో భార్యాభర్తలు బైక్ పైనుంచి కింద పడడం జరిగింది. ఆపరేటర్ శీనుకు స్వల్ప గాయాలు కాగా అతను భార్య జి కవిత అంగన్వాడి టీచర్ కు తలకు బలమైన గాయం కావడంతో కర్నూల్ మెడికవర్ హాస్పిటల్ కు తరలించగా తలలో బ్లడ్ క్లాట్ అవడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలపడంతో ఉన్న డబ్బులతో బ్రెయిన్ ఆపరేషన్ చేయడం జరిగిందని సుమారు 8 లక్షల వరకు ఖర్చు అయిందని తెలిపారన్నారు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్ గా ఉన్న జి. కవిత బ్రెయిన్ ఆపరేషన్ తర్వాత కోమాలో ఉన్నట్లు, ఉన్న డబ్బులతో ఆపరేషన్ చేయించామని ఇంకా ఎనిమిది లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో ఆ కుటుంబం పరిస్థితి బాగోలేక దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ కుటుంబానికి దాతల సహాయ సహకారం అందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడాలని సోషల్ మీడియా ద్వారా తెలియపరచడం జరుగుతుంది.. దాతలు తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని ఈ కుటుంబానికి అందించి ఆమె ప్రాణ రక్షణకు సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ దాతలు సహాయం చేయాలనుకునే వారు ఈ నెంబర్ కు సంప్రదించగలరని మనవి.