

జనం న్యూస్ 20: నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం పరిశ్రమలకు అనుకూలమైనదని మండలంలో మూసివేసిన పరిశ్రమ స్థానంలో ప్రతన్నమయ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఎన్డీఏ నాయకులు షేక్ మౌల పఠాన్ మెహర్ ఖాన్ బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ను కోరడం జరిగింది. సోమవారం రాజంపేట మన్నూరు లోని తోట కళ్యాణ మండపంలో నిర్వహించిన కేంద్ర బడ్జెట్ మేధావుల సదస్సులో బిజెపి పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ పిలుపు మేరకు ఎన్డీఏ నాయకులు పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశం అనంతరం బిజెపి పార్టీ రాజంపేట కో కన్వీనర్ డాక్టర్ అరిగే రాంప్రసాద్ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సమక్షంలో టిడిపి నాయకులు షేక్ మౌల,పఠాన్ మెహర్ ఖాన్, వాకాటి నారాయణరెడ్డి ఘనంగా శాలువా కప్పి సన్మానించి నందలూరు మండలంలో మూసివేసిన లోకో షెడ్ స్థానంలో ప్రతన్నమయ పరిశ్రమ కోసం ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా సుమారు 18 సంవత్సరాల నుండి పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఎన్నో విధాలుగా గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి ఒక్క నాయకులను పార్టీలకు అతీతంగా కలుపుకొని నందలూరులో పరిశ్రమలను స్థాపించాలని కోరడమైనదని అన్నారు,అదేవిధంగా మూసి వేసిన ఆల్విన్ ఫ్యాక్టరీ స్థానంలో ప్రతన్నమయ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకొని వెళ్లడం జరిగిందని అన్నారు,నందలూరు మండలం పరిశ్రమ ఏర్పాటుకు వనరులు పుష్కలంగా ఉన్నాయి అని.ఈ పరిశ్రమ ఏర్పాటు వలన మండల అభివృద్ధి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పోతురాజు మస్తానయ్య, ఆదినారాయణ,
ఏనుగుల బాలాo జనేయులు,రాచూరి మురళి,మహేష్,వీరబల్లి జయరాంరెడ్డి,శివారెడ్డి,టిడిపి నాయకులు ఆరుముగం విశ్వనాథ్,పార్లమెంట్ మహిళ ఉపాధ్యక్షులు దాసరిరాజు వాణి, హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ ఆఫ్ కౌన్సిల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు, తదితరులు పాల్గొన్నారు,