Listen to this article

జనం న్యూస్ 20 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు గుండెకు సంబంధించిన ముఖ్యమైన టెస్ట్ చేయడం కోసం 2డి. ఇ సి యచ్ ఓ కానీ ఈ మిషన్ గద్వాల ఏరియా జిల్లా ఆసుపత్రి కి జూలై 2023 రోజు ప్రారంభించారు. కానీ 2డి ఇ సి యచ్ ఓ సంబంధించిన టెక్నీషియన్ ఇంతవరకు గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి అపాయింట్ కాలేదు, టెక్నీషియన్ లేనందువలన గుండెకు సంబంధించిన పరీక్షలు చేయడానికి మిషన్ వాడకంలో లేదు 2023 నుండి 2డి ఇ సి యచ్ ఓ మిషన్ వాడకం చేయకపోవడం వలన ఖరీదైన ఈ మిషన్ తుప్పు పట్టడానికి చేరువలో ఉందని కొందరు అంటున్నారు .ఈ జనరేషన్ లో చాలామందికి పిల్లలకు, వయసుతో నిమిత్తం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయి, గుండెకు సంబంధించిన ముఖ్యమైన టెస్ట్ 2డి ఇ సి యచ్ ఓ పరీక్షల్లోనే గుండెకు సంబంధించిన విషయాలు వెళ్లడవుతాయి .కాబట్టి టెక్నీషియన్ను మరియు గుండెకు సంబంధించిన డాక్టర్ను గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటట్లు జిల్లాలోని ప్రజాప్రతినిధులు చొరవ చూపి మన గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలని , తెలంగాణ ప్రభుత్వాన్ని, జిల్లాలో ఉన్న యం యల్ ఎ లను, ప్రజాప్రతినిధులను గద్వాల ప్రజలు కోరుతున్నారు.