Listen to this article

కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు స్నేహ టీవీ రిపోర్టర్ కి 5000 రూపాయల ఆర్థిక సహాయం జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం

జనం న్యూస్ ఫిబ్రవరి 21 : (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) జర్నలిస్టుల సంక్షేమం మే లక్ష్యంగా వారి సమస్యల పరిష్కారం దిశగా ముందుకు కొనసాగుతామని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు. గురువారం మునగాల మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన స్నేహ టీవీ రిపోర్టర్ సోమపంగు వెంకటేశ్వర్లు గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురై ప్రస్తుతం ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తరపున గురువారం వెంకటేశ్వర్లను పరామర్శించారు.అనంతరం ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం 5000‌రూ చెక్కును వెంకటేశ్వర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ప్రధాన కార్యదర్శి గంధం వెంకటనారాయణ, చెరుకుపల్లి శ్రీకాంత్, తోటపల్లి నాగరాజు, కలకొండ బుచ్చి రాములు, కుర్ర రామారావు,గడ్డం లక్ష్మీనారాయణ, మొగిలిచర్ల నాగరాజు,సోమపంగు సూర్య తేజ, తదితరులు పాల్గొన్నారు.