Listen to this article

జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని. సర్వేనెంబర్ 532 భూమి. లబ్ధిదారులపై పారేస్ట్ అధికారుల దౌర్జన్యాన్నీ అరికట్టాలి. సాగుదారులపై అటవీశాఖ అధికారుల జులుంను అదుపుచెసి లబ్ధిదారులకు న్యాయం చేయాలి.అని. రూరల్ ఎం.ఎల్. ఏ. భూపతి రెడ్డి క్యాంప్ ఆఫిస్ కు తరలిన సిరికొండ పట్ట దారులు. సమస్య పరిష్కారం కోసం సిపిఐ(ఎం. ఎల్.) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో పరిష్కారం కోసం ఎం.ఎల్.ఏ. ద్రుష్టికి. సిరికొండ 532 భూమి లబ్ధిదారులపై పారేస్ట్ అధికారుల దౌర్జన్యాన్నీ అరికట్టాలని,సాగుదారులపై అటవీశాఖ అధికారుల జులుంను అదుపుచెసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఈ సందర్బంగా సిపిఐ(ఎం. ఎల్) మాస్ లైన్.రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్, రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ. మాట్లాడుతు సిరికొండ మండల కేంద్రంకు చెందిన 532 సర్వే నెంబర్ కు చెందిన భూమి లబ్ధిదారుల భూములను అటవీ శాఖ అధికారుల జులుంను అరికట్టి పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఇట్టి భూములు చెందేలా చర్యలు తీసుకోవాలి ఆని అన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని 532 సర్వే నెంబర్ లో 200 మంది లబ్ధిదారులకు 2009లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు చేసి లబ్దిదారులకు ఇచ్చిందని, పట్టాలు ఇచ్చాక తమ భూములను చదును చేసుకుందామని లబ్ధిదారులు ప్రయత్నిస్తుంటే అటవీశాఖ అధికారులు రెవెన్యూ భూములైన లబ్ధిదారులు పొందిన భూములను సాగు చేసుకుంటుంటే అటవీశాఖ అధికారులు తమ భూములుగా దౌర్జన్యపూరితంగా అడ్డుకుంటున్నారన్నారు. 20 సంవత్సరాలకు పైగా లబ్ధిదారులను అనేక విధాలుగా వేధిస్తూ అడ్డుకుంటున్నారు. ఈ భూముల విషయం పట్టాలు పొందిన లబ్ధిదారులకు అనుకూలంగా హైకోర్టు ఈ భూముల జోలికి పోకూడదని అటవీ శాఖ అధికారులను ఆదేశిస్తూ తీర్పునిచ్చిందని,అయినా అటవీశాఖ అధికారులు హైకోర్టు తీర్పును బేఖాతారు చేస్తున్నారన్నారు. 20 ఏళ్లుగా స్థానిక అధికారులను మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు ప్రభుత్వ అధికారులకు విన్నవించుకోవడం జరిగింది. అనేకమంది ప్రజా ప్రతినిధులను కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. వీరి గోడు ఎన్నిసార్లు ఎవరికి విజ్ఞప్తి చేసిన చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు ఉంది. తమరికి కూడా పలు దపాలుగా విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక చూసి చూసి లబ్ధిదారులు వేసారి పోయారు. ఇక చావో, రేవో తేల్చుకోవాలని లబ్ధిదారులు భావిస్తున్నారు. రెవెన్యూ శాఖ, అటవీశాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే చేసినప్పటికీ చివరికి అధికారులు పట్టించుకోవడం లేదు. తమరు విశాల హృదయంతో ఆలోచించి ఈ సమస్యను సహృదయముతో అర్థం చేసుకొని సిరికొండ 532 లబ్ధిదారులకు న్యాయం చేయాలని తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యక్రమంలో మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, పిట్ల. రామకృష్ణ.సిపిఐఎంల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శిఆర్. రమేష్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, బి. బాబన్న, మండల నాయకులు ఈ. రమేష్,ఎం. డి. అనిస్, ఎస్. కిషోర్, బి. నాగన్న, జాహిరబీ, ఐనాలా. ముత్త, సీతాయ్ పేట. గంగవ్వ, మందుల. గంగాధర్, స్వరూప, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.