

జనం న్యూస్ ఫిబ్రవరి 20: చిలిపి చెడు మండలం ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు మరియు నమూనా పరీక్షలు పరీక్షించడానికి జిల్లా విద్యాధికారి చిలిపిచేడ్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేటని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది .జిల్లా విద్యాధికారి గారు పదవ తరగతిలోకి వెళ్లి విద్యార్థులతో ఉత్తమ ఫలితాల కోసం ఏ విధంగా చదవాలో తెలియజేసి విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టడం జరిగింది . అదేవిధంగా 9వతరగతిలోకి వెళ్లి హిందీ క్లాసును పరిశీలించడం జరిగింది విద్యార్థులకు హిందీ పాఠం కు సంబంధించి కొన్ని ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టడం జరిగింది .విద్యార్థుల సమాధానాలకు సంతోషించి హిందీ ఉపాధ్యాయుడైన మహేష్ ని అభినందించడం జరిగింది .అదేవిధంగా మండలంలోని ప్రాథమిక పాఠశాల ఫైజాబాద్ ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫైజాబాద్ చిట్కుల్ పాఠశాలలకు వెళ్లి తరగతులను సందర్శించి పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కొరకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది .అదేవిధంగా మండలంలోని కేజీబీవీ చిట్కుల్ పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడం జరిగింది .మధ్యాహ్నభోజనం నాణ్యత మరియు పరిశుభ్రంగా ఉండాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలియజేయడం జరిగింది .ఇందులో చిలిపిచేడు మండల విద్యాధికారి విట్టల్ జిల్లా విద్యాధికారితో పాటు పాఠశాలలకు వెళ్లి తనిఖీ చేయడం జరిగింది