Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చిలిపిచెడ్ మండలంలోని చిలిపిచెడ్ మరియు చిట్కుల్ రైతు వేదికల్లో రైతులకు పంటకొత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ గా జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ కుమార్ విచ్చేశారు. “రైతులు పూర్తిగా పక్వానికి వచ్చిన పంటను మాత్రమే కోతలు జరపాలని,కోత సమయంలో హర్వెస్టర్ ఆర్ పి ఎం 18-20 లేదా ఆ పైన ఉండేలాగా చూసుకోవాలని, బ్లోవర్ ఆన్ లో ఉంచితే తాలు , చెత్త వంటి పదార్థాలు ధాన్యం నుండి వేరు చేయవచ్చని,తర్వాత ధాన్యాన్ని సరిగ్గా ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావడం వల్ల కొనుగోలు కేంద్రాలు నుండి నాణ్యత కలిగిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించడానికి వీలవుతుంది ” జిల్లా వ్యవసాయ అధికారి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం ఏ ఓవెంకట రాజశేఖర్ వ్యవసాయ విస్తరణ అధికారులు కృష్ణవేణి,దివ్య శ్రీ మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు