

జనం న్యూస్,ఫిబ్రవరి20, అచ్యుతాపురం: గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం మండల సీఐటీయూ కన్వీనర్ కే . సోమునాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము, రైతు సంఘం నాయకులు కె. రామ సదాశివరావు మాట్లాడుతూ 25 సంవత్సరాలు పైబడి గ్రామ పంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకు చాలీచాలని జీతాలు చెల్లిస్తున్నారని, దీంతో వీరి ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం నెలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని, బకాయి జీతాలు చెల్లించి గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ, పిఎఫ్,సెలవులు వంటి సౌకర్యాలు కల్పించాలని రిటైర్మెంట్ అయిన వారికి గ్రాడ్యుటి,పింఛన్ సౌకర్యం కల్పించాలని పనిలో ప్రమాదాలు జరిగితే ప్రభుత్వం వైద్య సేవలు అందించి గ్లౌజులు, బూట్లు,మాస్కులు, నూనె,సబ్బులు, పనిముట్లు నాణ్యమైనవి సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.