Listen to this article

రామకోటి సేవలు అభినందనీయం – వంగపల్లి అంజయ్య స్వామి

జనం న్యూస్, ఫిబ్రవరి 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రామకోటి రామరాజు సేవలు అభినందనీయం అని వంగపల్లి అంజయ్య స్వామి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం రేణుక ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో రామకోటి రామరాజు ఘన సన్మానం చేశారు. అనంతరం వంగపల్లి అంజయ్య స్వామి ట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కాచారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అనగా 23-02-2025 రోజున నిర్వహించే వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా రామకోటి రామరాజుకు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందన్నారు. అనంతరం రామకోటి రామరాజు మాట్లాడుతూ వంగపల్లి అంజయ్య స్వామి ప్రజలను భక్తి మార్గం వైపు పయనించే విధంగా కృషి చేస్తూ ప్రతి మంగళవారం రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభిందనేయం అని ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని అన్నారు.