Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 11 రిపోర్టర్ సలికినిడి నాగరాజు

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన సంవత్సర 2025వ క్యాలెండర్లను శుక్రవారం ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వారి నివాస గృహంలో ఆవిష్కరించారు. అతి తక్కువ కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం పలు సేవా కార్యక్రమాలతో పాటు, పాత్రికేయుల హక్కుల కోసం కృషి చేస్తున్నారని అన్నారు. మునుముందు మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘ నాయకులు, పాత్రికేయులు నాయకులు పాల్గొన్నారు.