

జనం న్యూస్ 22: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ అన్నా క్యాంటీన్ల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సిబ్బందికి విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్‌ను ఆయన పరిశీలించారు. నిర్ణీత సమయానికల్లా అన్నా క్యాంటీన్ పర్యవేక్షకుడు విధులకు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని తదనుగుణంగా వ్యవహరించాలని సూచించారు.