

జనం న్యూస్ ఫిబ్రవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్రం షాక్ ఇచ్చింది, 24 గంటల్లో ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతి లను రిలీవ్ చేయాలని తెలం గాణ ప్రభుత్వాన్ని ఆదేశిం చింది,కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడ్డ ముగ్గురు అధికారులు వెంటనే ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది అంతేకాదు, 24 గంటల్లోగా ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది రాష్ట్ర విభజన సందర్భంగా ఈ అధికారులను ఏపీకి కేటా యించబడ్డారు అయితే, ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి తెలంగాణలోనే కొనసాగు తున్నారు. గుతోన్న అంజనీ కుమార్ రోడ్ సేఫ్టీ డీజీగా ఉండగా డీజీ ర్యాంక్‌లో ఉన్న మరో ఐపీఎస్ అధికారి అభిలాష్ బిస్తా పోలీస్ ట్రైనింగ్ డీజీగా ఉన్నారు..
ఇక ఎస్పీ ర్యాంకులో కొనసాగుతున్న అభిషేక్ మహంతి. ప్రస్తుతానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు అయితే అంజనీ కుమార్ అభిలాష బిస్త్ అభిషేక్ మహంతిలను వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించి కేంద్ర హోంశాఖ వెంటనే ఏపీ క్యాడర్ లో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోం శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.