

జనం న్యూస్ పీబ్రేవరి 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సిర్పూర్-యు పోలీసులు దేవుడుగూడ గ్రామ శివారులో జూద స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో 9మంది పేకాటరాయుళ్లు పట్టుబడి, రూ. 10, 160 నగదు, 3 సెల్ఫోన్లు, 52 పేక ముక్కలు సీజ్ చేసినట్టు ఎస్ఐ రామకృష్ణ శనివారం తెలిపారు. పట్టుబడ్డవారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడిలో పాల్గొన్న సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.