Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 22 : శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం లోని అతి పురాతనమైన శ్రీమత్స్యగిరి స్వామి జాతర కోసం శ్రీ మచ్చర్లయ గుట్ట వద్ద కరెంటు సౌకర్యం కల్పించేందుకు దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సామల బిక్షపతి, మండల విద్యుత్ శాఖ ఏఈ చందులాల్ తో కలిసి వెళ్లి మత్స్యగిరి స్వామి వెలసిన అత్యంత వైభవంగా జాతర జరిగే మచ్చర్లయ గుట్ట వద్ద శనివారం పరిశీలన చేశారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే మత్స్యగిరి స్వామి జాతరకు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏఈ చందులాలతో కలిసి జాతర జరిగే ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఐదు విద్యుత్ స్తంభాలు, మినీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. దీనివల్ల జాతర సమయంలో విద్యుత్తు సరఫరా సమస్య తీరుతుందని భక్తులకు, జాతర ఉత్సవాలలో ఎలాంటి ఇబ్బంది ఉండదని శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానం చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు.
.