


జనం న్యూస్, ఫిబ్రవరి 23, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీ లో, ఈసీసీ డే, నాలుగవ శనివారం సందర్భంగా, పాములపర్తి 1, సెంటర్ లో, పిల్లల అభివృద్ధి నాణ్యమైన విద్యా కార్యక్రమం, ప్రీ స్కూల్,గురించి కరికులంతో పాటు అవగాహన చేయించడం జరిగింది. అందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు, శ్రీమంతం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ డెబోరో రాణి, అగ్రికల్చర్ ఆఫీసర్ రజినీకాంత్, అంగన్వాడీ టీచర్ జై బునిసా, ఆయా లక్ష్మి, తల్లులు బాలింతలు పాల్గొనడం జరిగింది.