Listen to this article

బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ జనం న్యూస్ ఫిబ్రవరి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు సూర్యాపేట జిల్లాలో మునగాల, పెన్ పహాడ్ ,చివేంల,మోతే మండలాలలో వరిపైరు సేద్యం చేసిన రైతుల పంట పొలాలు ఎండిపోతున్నందున రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణమే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీళ్లు విడుదల చేసి ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం మునగాల ,వెంకటరాంపురం, నేల మర్రి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను వారు పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. మునగాల మండల పరిధిలో తాడువాయి, వెంకటరాంపురం, నేలమర్రి, ఈదులవాగు తండా, రేపాల, సీతానగరం, నరసింహుల గూడెం మాధవరం, గ్రామాలలో స్థానిక రైతులు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి విత్తనాల ఒడ్లు,నాటు కూళ్ళు, ట్రాక్టర్ కిరాయిలు, పురుగుమందులకు హెచ్చించి ఆర్థికంగా నష్టపోయారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే శ్రీరాంసాగర్ ద్వారా నీళ్లు విడుదల చేయాలని, లేకపోతే వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు తెలిపారు.తక్షణమే ప్రభుత్వం సాగునీరు విడుదల చేసి పంటలు కాపాడాలని వారు డిమాండ్ చేశారు