Listen to this article

సతీష్ జక్కుల,టాటా ఏ ఐ ఏ బ్రాంచ్ మేనేజర్. జనం న్యూస్ ఫిబ్రవరి 22 (కొత్తగూడెం ఆర్ సి కురిమెల్ల శంకర్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని, మొర్రేడు బ్రిడ్జి దగ్గర, టాటా ఏఎంసి లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ఎండాకాలం దృష్ట్యా రోడ్డు మీద పోయే ప్రయాణికులకు, మజ్జిగ ప్యాకెట్లు అందజేసిన, ముఖ్య అతిథి, జక్కుల సతీష్ పాల్గొని మాట్లాడుతూ, భారతదేశంలో 2047 సంవత్సరం వరకు ప్రతి వ్యక్తికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్న ఐ ఆర్ డి ఏ (సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ) కి సపోర్ట్ గా టాటా ఏ ఐ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ మేము సైతం అన్నట్టు సంకల్ప యాత్రను శనివారం నిర్వహించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో వంద మందితో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకతను స్లొగన్స్ ఇస్తూ బైకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.154 సంవత్సరాల అపార అనుభవం కలిగిన 150 రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్న టాటా ఏ ఐ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ నమ్మకమైన బ్రాండ్ అని అన్నారు. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన సొమ్ములో లైఫ్ ఇన్సూరెన్స్ లో కొంత దాచుకోవాలని దాని ద్వారా కుటుంబానికి భద్రతతో పాటు భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందన్నారు. జీవిత బీమా ఉన్నవారు ధీమాతో ఉండవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సింగరేణి రిటైర్డ్ జి ఎంలు అందెల ఆనందరావు, శనగ వెంకటేశ్వర్లు,లీడర్లు డి.శివ ప్రసాద్,కనకదుర్గ, బీసీ ఎస్సీ ఎస్టీ జిల్లా ఇంచార్జ్ సంజీవన్, తుంపూరు శివ, దేవరాజు, లక్ష్మణ్, గాయత్రి, కమలరాణి, హరీష్, మనోహర్, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.