

జనంన్యూస్. 23. నిజామాబాదు. సిరికొండ. స్థానిక సిరికొండ ఎస్సై ఎల్ రాము. తెలిపిన వివరాల ప్రకారం పోతునూరు గ్రామంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రావడంతో సిరికొండ ఎస్ ఐ ఎల్ రామ్ తన సిబ్బందితో కలిసి అట్టి పేకాట స్థావరంపై దాడి చేసి 9 మంది పేకాట ఆడే వ్యక్తులను పట్టుకుని వారి దగ్గర నుంచి 22,900 రూపాయల నగదు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయడమైనది అట్టి వ్యక్తులు పోతునూర్ గ్రామానికి చెందిన 1.మన్నే నరేష్ 2.జోమ్మా రవీందర్ 3.క్యారం సామెల్ 4.గుమ్మడి సంజీవ్ 5.మన్నె రాములు 6.మన్నే గంగాధర్ 7.జోమ్మ సతీష్ 8.బర్రె మహేందర్ 9.జొమ్మ నితీష్. తదితరులు ఉన్నారు . అయితే మండలంలోని. రోజు.రోజుకు పెరిగిపోతున్న పేకాట. పోలీసులు ఎంత చెప్పినా తమకేమీ పట్టనట్టుగా పలువురు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమైనది. విద్యాబుద్ధులు నేర్పే టీచర్లు ప్రజాప్రతినిధులు. ఇలా అడ్డదారిలో పేకాట ఆడి దొరికితే పొద్దున ఏ ముఖం పెట్టుకొని సమాజానికి జవాబు చెప్పగలరు. ఇలాంటి వారికి అధికారం ఇస్తే రేపు. కాందారులను కాపలాగా పెట్టి గ్రామపంచాయతీని పేకాట అడ్డగా మార్చేస్తారు. మండల ఆఫీసులు. సొసైటీలు. స్కూల్. చివరికి బస్ స్టాప్ లు పేకాటకు అడ్డ స్థావరాలుగా మారిపోతాయి. పోలీసులు ఇలాంటి వారిపై కేసు వేసి రానున్న ఎలక్షన్లలో వీరిని అనర్హుల్ గా ప్రకటించాలి… సమాజంలో ఎంతో కొంత మార్పు వస్తుందని ఆశిద్దాం.