

జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం జేత్వన్ బుద్దావిహార్ లో సంత్ గాడ్గే బాబా 149వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించరు ఈ కార్యక్రమం పెద్దలు ఉప్రే జైరం మాట్లాడుతూ భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ భిక్షాటన సాధువు మరియు సామాజిక సంస్కర్త . ఆయన స్వచ్ఛంద పేదరికంలో జీవించి, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి మరియు ముఖ్యంగా పారిశుద్ధ్యానికి సంబంధించిన సంస్కరణలను ప్రారంభించడానికి వివిధ గ్రామాలకు తిరిగారు. ఆయన ఇప్పటికీ భారతదేశంలోని సామాన్య ప్రజలచే గౌరవించబడుతున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమం లో పండు, రాజేశ్వర్, సంజు, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.