Listen to this article

నల్లా పన్నులు వసూలు చేయడంలో చూపే శ్రద్ధ ..మురికి కాలువలు శుభ్రం చేయడంలో కూడా శ్రద్ద చూపాలి.. స్థానికుల గోసలు..

జనం న్యూస్ // ఫిబ్రవరి // 23 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణం లోని ( 6 ) వా వార్డులో చెత్తాచెదారం పేరుకుపోయింది. మురికి కాలువలు, ఖాళీ స్థలాల్లో చెత్త,చెదారం నిండిపోయింది. గత 15 రోజులుగా వార్డులో మురికి కాలువలు శుభ్రం చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఖాళీ స్థలంలో చెత్త ఉండడం వల్ల దోమలు, పాములు వస్తున్నాయని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన స్పందించడం లేదని వాపోయారు. నల్ల పన్నులు వసూలు చేయడంలో చూపే శ్రద్ధ శుభ్రత పై కూడా చూపాలని, ఇప్పటికైనా దీనిపై వెంటనే కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు అభ్యర్థిస్తున్నారు.