

జనం న్యూస్ 24 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జామి మండలం యాతపాలెంలో గడ్డికుప్ప కాలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం యాతపాలెం గ్రామానికి చెందిన ఆర్ హాచలంకు చెందిన కల్లాంలో ఈ ప్రమాదం సంభవించి గడ్డి కుప్పలు ప్రమాదానికి గురయ్యాయి. కొత్తవలస అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసినట్లు అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. సుమారు రూ. 20,000 ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు వాపోయాడు.