Listen to this article

జనం న్యూస్ 11 జనవరి ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు )

వికారాబాద్ జిల్లా, పూడూర్, మండల పరిధిలోని మంచన్ పల్లి ZPHS హైస్కూల్లో 2004-05  వ SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తేది 11.01.2025 శనివారం రోజున నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ఉపాధ్యాయులకు గుర్తింపు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమాపతి సార్, జాకిర్ ఆలీ సార్, అనంతరావు సార్, కాజా పాషా సార్, చిన్నయ్య సార్, అమర్నాథ్ సార్, విజయ సాయి సార్, సుమంత్ సార్, అనిత మేడం మరియు పూర్వ విద్యార్థి విద్యార్తినిలు పాల్గొనడం జరిగింది.