

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 24 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఎపిపిఎస్సీ గ్రూపు 2 మెయిన్ పరీక్షలు నిర్వహించిన జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 23న తెలిపారు. గ్రూపు 2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. విజయనగరం జిల్లాలో ఎపిపిఎస్సీ గ్రూపు2 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్న జె.ఎన్.టి.యు., సీతం, ఎం.వి.జి.ఆర్.పి.జి. కాలేజ్, ఎం.ఆర్.ఫార్మశీ, ఎం.ఆర్.అటానమస్, శ్రీ చైతన్య డిగ్రీ, ఆర్.కే.డిగ్రీ, గాయత్రీ డిగ్రీ, లెండీ, ఎ.జి.ఎల్. కళాశాలల వద్ద పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఒక్కొక్క పరీక్షా కేంద్రం వద్ద ఎస్ఐ స్థాయి అధికారితో సహా ఇతర సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు. పరీక్షా కేంద్రాలను 7రూట్లుగా విభజించి, ఒక్కొక్క రూటులో ఒక సిఐని పర్యవేక్షణ అధికారిగా నియమించి, పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, భద్రత చర్యలు చేపట్టామన్నారు. పరీక్షా కేంద్రాలకు పేపర్లు తరలింపు, పరీక్ష పూర్తయిన తరువాత పేపర్లును స్ట్రాంగు రూంకు తరలించేందుకు ఆర్మ్ పోలీసులను నియమించామన్నారు. పరీక్షా కేంద్రాలకు దగ్గరలోని జెరాక్స్, ఫోటో స్టూడియోలను పరీక్ష ముగిసే వరకు మూసివేయించామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మఫ్టీలో పోలీసులను నియమించి, ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించామని, అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే వారిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించామన్నారు. పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీసు జరగకుండా పరీక్షలకు ఇన్విజిలేషనుగా నియమించిన అధికారులు, అభ్యర్ధులు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోనులు తీసుకొని పరీక్షా కేంద్రాలకు వెళ్ళకుండా చర్యలు చేపట్టామన్నారు. పరీక్షా కేంద్రాలకు చుట్టు ప్రక్కల ప్రాంతాలను డ్రోన్స్ నిఘా పెట్టామన్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్ళే మార్గాల్లో అభ్యర్థులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల రాకపోకలు, రద్దీని డ్రోన్స్ పర్యవేక్షించామని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయడంతో గ్రూపు 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. గ్రూవు 2 మెయిన్స్ పరీక్ష నిర్వహణను విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిఐలు ఎస్.శ్రీనివాస్, టి.శ్రీనివాసరావు, చ్.షణ్ముఖరావు, ఈ.నర్సింహమూర్తి, ఎన్.వి.ప్రభాకరరావు, బి.లక్ష్మణరావు, జి. రామకృష్ణ మరియు పలువురు ఎస్ఐలు, పోలీసు సిబ్బంది భద్రత విధులను నిర్వహించారు.