Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 24: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లాలో నేరాలను నియంత్రించుటలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న శివారు ప్రాంతాలను, రద్దీ ప్రాంతాల్లోను, పండగల్లో నిఘా పెట్టేందుకు, ఈవ్ టీజింగు, ఓపెన్ డ్రింకింగ్, కోడి పందాలను, చైన్ స్నాచింగ్స్ ను నియంత్రించేందుకు డోన్స్ ను వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 23న అన్నారు. జిల్లాలో నేరాలను నియంత్రించుటకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, డ్రోన్స్ ను వినియోగించి, నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో చైన్ స్నాచింగ్స్, ఈవ్ టీజింగు, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ప్రాంతాలు, కోడి పందాలు, ఓపెన్ డ్రింకింగ్, పేకాటలు, వాహనాల రాకపోకలు, పండగల్లో రద్దీని క్రమబద్ధీకరించేందుకు, ఇతర నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలను, నిశిత ప్రాంతాలను, తోటలు, బహిరంగ ప్రదేశాలను, పార్కులు, నదీ తీరాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ ను పంపి, నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్య కూడళ్ళలో ట్రాఫిక్ నియంత్రణ, మహిళలపై దాడులను నియంత్రించేందుకు, సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టేందుకు డ్రోన్స్ ను వినియోగించి, నేరాలను కట్టడి చేస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. విజయనగరం పట్టణంలోని జె.ఎన్.టి.యు., కలెక్టరేట్ జంక్షన్, కే.ఎల్. పురం, మయూరి కూడలి, ఆర్టీసి కాంప్లెక్స్, రైల్వే స్టేషను, ఆర్టీసి కాంప్లెక్స్, తోటపాలెం, బాలాజీ జంక్షన్ వంటి ప్రాంతాలను, కళాశాలల వద్దకు వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రోన్స్ ను పంపి, ఆయా ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేసామని ఈవ్ టీజింగు, చైన్ స్నాచింగ్స్, ఇతర నేరాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అదే విధంగా, విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి సబ్ డివిజను ప్రాంతాల్లో రహదారిy ప్రమాదాలు జరిగేందకు అవకాశమున్న బ్లాక్ స్పాట్స్, ఇతర నేరాలైన చైన్ స్నాచింగ్స్, ఈవ్ టీజింగు, పేకాటలు, కోడి పందాలు, పండగల్లో రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఇతర నేరాలు జరిగేందుకు అవకాశమున్న ప్రాంతాలకు పోలీసుల ఆధ్వర్యంలో డ్రోన్స్ ను పంపి, ఆయా ప్రదేశాలపై నిఘా ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో డ్రోన్స్ ను వినియోగిస్తూ ఓపెన్ డ్రింకింగు చేసిన వారిపై 3400 కేసులు, మద్యం సేవించిన వాహనాలు నడిపిన వారిపై 907 కేసులు నమోదు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.