

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి: ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి.
జనం న్యూస్: 12 జనవరి 2025 నిడమనూరు మండలం, నల్లగొండ జిల్లా, బొంగరాల శ్రీనివాస్ ప్రతినిధి.
నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి(సాగర్) మండలం,బంటు వెంకన్న భావి తండ,సపావత్ తండాలో
సంక్రాంతి పండగ సందర్భంగా గణేష్ యువజన సంఘం ఆధ్వర్యంలో మెరావత్ ముని నాయక్ (ఆస్ట్రేలియా) గారి నిర్వహణలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి క్రికెట్ పోటీలను రిబ్బన్ కట్ చేసి,కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ ఆరోగ్యమైన సమాజాన్ని కిడా మైదానం నుంచి ప్రారంభం అవుతుందన్నారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంపొందుతోందని పేర్కొన్నారు. అనంతరం ఆయన క్రికెట్ ఆడి యువకులను ఉత్సాహపరిచారు.బంటు వెంకన్న బావి తండా చింతలపాలెం జట్ల ఫ్రెండ్లీ మ్యాచ్కు ఆయన టాస్ వేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అల్లి పెద్ది రాజు యాదవ్,మాజీ మండల బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు బి.వి రమణ రాజు,సీనియర్ నాయకులు తెరా రాఘవ రెడ్డి,బి.ఆర్.యస్ పార్టీ నాయకులు జటావత్ శ్రావణ్ కుమార్ నాయక్, ప్రకాష్ నాయక్,గర్కనెట్ తండ మాజీ ఉప సర్పంచ్ కిషోర్ నాయక్,బి.ఆర్.యాదవ్.వి రాష్ట్ర కార్యదర్శి చల్లా కోటేష్ యాదవ్,యం.సి.కె.ఆర్ యువసేన నాయకులు గడ్డమీది నాగార్జున,బంటు వెంకన్న బావి తండా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్.వెంకట్రావు, జటవత్ మేఘు నాయక్,లాల్ సింగ్,జామ్ల,రవి,రంగా,సంతోష్,లచ్చిరాం,మరియు సపావత్ తండా నాయకులు యస్. చందు నాయక్,మంగ్యా,కె.బాలూ, దాసర్,పంతు,నాగా,స్వామి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు