Listen to this article

జోగులాంబ గద్వాల్ జిల్లా తుమ్మిళ్ల ఎత్తిపోతల పంపకు అందని నీరు. ఆర్డీఎస్ ఆయకట్టు కింద పంటలు ఎండుతుండడంతో ఆందోళన చెందుతున్న రైతులు.డిస్ట్రిబ్యూటర్ 23 కు చేరుకొని ఆర్డీఎస్ నీటి వాటా.. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గంలోని తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకానికి నీరు అందక ఎత్తిపోతల నిలిచిపోయిందని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి జాయింట్ వాటా కింద విడుదలైన నీరు సుంకేసుల బ్యారేజ్ కి చేరుకోవడంతో కేసి కెనాల్ కు నీటి విడుదల నసాగుతుంది. దీనితో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీరు అందక ఎత్తిపోతల నిలిచిపోయింది. పంటలు చివరి దశలో ఉన్నందువలన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్డీఎస్ డిస్ట్రిబ్యూటరీ 23 వరకు స్వల్పంగా నీరు పారుతుండడంతో రైతులు అడపదడప నీటి తడులు పెట్టుకోవడం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. వారబందీ ప్రకారం అయినా నీటి తడుల అందించాలని రైతులు అంటున్నారు. కె సి కెనాల్ నీటి విడుదలను నిలుపుదల చేసి తుమ్మిళ్ళ ఎత్తి పోతల పథకానికి నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయని రైతులు వాపోతున్నారు.