

పిబ్రవరి 24 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల ప్రధాన కార్యదర్శి గా ఏకుల వెంకటేశ్వర్లునియమితులైనట్లు బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షుడు కొండా కౌషిక్ సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. చర్ల మండల బిఎస్పీ కార్యాలయం లో జరిగిన కార్యక్రమం లో భాగంగా ఇటీవల పార్టీ లో చేరిన ఏకుల వెంకటేశ్వర్లు గారిని ఆయన పార్టికి మండల కీలక స్థానం లో సేవలందించాల్సిన అవసరం ఉందని భావించి నియమించి నట్లు తెలియ జేశారు… ఈ సమావేశానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన బిఎస్పీ భద్రాచలం నియోజక వర్గ అద్యక్షుడు కొండా చరణ్ మాట్లాడుతూ ఎంబిసి లకు బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయ అవకాశాలు కల్పించి రాజ్యాధికారం లో జనాభా కు తగిన వాటా ఇస్తుందని అన్నారు. బిసి,ఎస్సీ ఎస్టిలకు,మహిళలకు,మతమైనారిటీలకు జనాభాకు తగిన రాజకీయ అవకాశాలు కల్పించేందుకే సామాజిక న్యాయ అజెండా గా బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించబడిందని,భద్రాచలం నియోజకవర్గం వ్యాప్తంగా బిసి,ఎస్సి,ఎస్టి ప్రజల పెద్ద ఎత్తన పార్టీ లో చేరుతుండడం,రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కి ఆదరణ లభిస్తున్న చూస్తుంటే బహుజన రాజ్యం రాబోతోందని అనిపిస్తోందని అన్నారు.
