

తాడువాయి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ జనం న్యూస్ ఫిబ్రవరి 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు వెంటనే తమ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతం అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ తో కలిసి మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా మధ్యవర్తులను ఆశ్రమించవద్దని మీ యొక్క ఖాతాలోనే ప్రభుత్వ నుండి అమౌంటు జమఅవుతుందని తెలిపారు.ప్రభుత్వం దశల వారీగా ఇంటికి సంబంధించిన నగదును లబ్ధిదారులకు ఖాతాలలో జామ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శిరీష,మండల తహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు,ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్,సహా ఇంజనీర్ హౌసింగ్ మూర్తి,గ్రామ పంచాయతీ కార్యదర్శి రాము నాయక్ పాల్గొన్నారు.

