Listen to this article

2 లక్షల మంది భక్తులకు ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నాము

సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు

కోటి జన్మల పుణ్యమే ఈ గోటి తలంబ్రాలు కార్యక్రమం

జనం న్యూస్, ఫిబ్రవరి 25( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచలం దేవస్థానం నుండి వచ్చిన 250కిలోల గోటి తలంబ్రాలు వడ్లకు అద్దాల మందిరం వద్ద శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులకు అందించడానికి వడ్ల ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్బంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ గత సంవత్సరం లక్ష మంది భక్తులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సంవత్సరం 2లక్షల మంది భక్తులను గోటి తలంబ్రాల్లో పాల్గొంటారని వారందరి గ్రామ, గ్రామాన ఒడ్ల ప్యాకెట్లు అందిస్తామని తెలిపారు. భద్రాచలం సీతారాముల కళ్యానానికి తెలంగాణ రాష్ట్రం నుండి రామకోటి సంస్థ 250కిలోల గోటి తలంబ్రాలు అందిస్తామని తెలిపారు. ముచ్చటగా మూడోసారి అందించడం ఆనందంగా ఉందన్నారు.