Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు 26 -2- 2025 బుధవారం ఉదయం 9 గంటల నుండి నరసరావుపేట రోడ్డులోని గంగమ్మ తల్లి దేవస్థానం నందు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని అసోసియేషన్ నాయకులు తెలిపారు. పట్టణంలోని సిఆర్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ కృష్ణ యాదవ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మరియు గంగమ్మ తల్లి యాదవ సంక్షేమ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్రికోటేశ్వర స్వామి భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని కావున యాత్రికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సంఘ గౌరవాధ్యక్షులు రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ గోరంట్ల నారాయణ యాదవ్ తెలిపారు పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు మసిముక్కల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కృష్ణ యాదవ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (SKYOPA )నాయకులు ఆరాధ్యుల రామకృష్ణ పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా యాత్రికులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామని గతంలో నరసరావుపేట సెంటర్లో ఏర్పాటు చేసేవారని ఈసారి గంగమ్మ తల్లి దేవస్థానం వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు జరుగుతుందని ఈ మార్పులు గమనించాలని యాత్రికులు అందరూ సద్వినియోగం చేసు కోవాలని కోరారు. అసోసియేషన్ నాయకులు గోపిదేసి నాగ ప్రసాద్ గోపిదేసి గోపి తదితరులు పాల్గొన్నారు