

జనం న్యూస్ పీబ్రవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కరీంనగర్ -నిజామాబాద్ అదిలాబాద్ నియోజకవర్గం 27వ తేదీ జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మెదక్- నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూటుకూరి నరేందర్ రెడ్డి ని గెలిపించండి ముంజం ఆనంద్ కుమార్ సిపిఎం పార్టీ సిర్పూర్ నియోజకవర్గం కన్వీనర్ ఉమ్మడి నాలుగు జిల్లాలలో కలిపి గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు గెలిచినప్పటికీ కనీసం నయా పైసా పని కూడా చేయలేదని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిరిపూర్ నియోజకవర్గంలో బిజెపి గెలిచి నా కానీ ఇప్పటివరకు ఎలాంటి పనులు కూడా చేపట్టలేదు కావున బిజెపి ని ఓడించాలి , ఆదిలాబాద్ సిసిఐ ఫ్యాక్టరీ గాని, నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ కనీసం ఒక రూపాయి కూడా కేటాయించలేదని, నిజామాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ గాని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గాని, కరీంనగర్ కాజీపేట రైల్వే లైన్ కానీ, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ ఒక్క నవోదయ స్కూల్ గాని, సైనిక్ స్కూల్ గాని తేలేదని ఆరోపించారు. బొగ్గు బ్లాక్లను వేలం వేశారని దుయ్యబట్టారు. ప్రజలకు ఏ ఒక్క మంచి పని కూడా చేయకుండా బిజెపికి పట్టభద్రులకు ఓటు హక్కు అడిగే అర్హత లేదని అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలన్న మోడీ ప్రభుత్వం గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందన్నారు. కుమురం భీం జిల్లాలో సిర్పూర్ నియోజకవర్గం గెలిచిన బిజెపి అభ్యర్థి 100 రోజుల్లో 100 కోట్లు తీసుకొస్తానని ప్రగల్బాలు పలికి కి ఒక్క రూపాయి అభివృద్ధి పని కూడా చేయలేదని ఆరోపించారు. పైపెచ్చు ఉత్తర తెలంగాణ జిల్లాలలో మత ఘర్షణలకు, కులకర్షణలకు బిజెపి ఆజ్యం పోస్తుందని అటువంటి అభ్యర్థులను ఓడించాల్సిన అవసరం ఉందని అన్నారు. కావున ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న లౌకిక విలువలను కాపాడాలన్న లౌకికశక్తి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని జిల్లాలోని పట్టభద్రులను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సిపిఎం విజ్ఞప్తి చేస్తుంది.