

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అక్షర పబ్లిక్ స్కూల్ విద్యార్థినులకు శాలువాతో సన్మానించి మొమెంటో గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికెట్ అందించిన విశ్వ మానవధికార పరిషత్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మస్తాన్ సాహెబ్ నేషనల్ స్టూడెంట్ ఇన్వెషన్ ఛాలెంజ్ NSIC 2025 సీజన్ 8 కాంపిటీషన్లో రెండోసారి బెంగళూరులో జరిగిన కాంపిటేషన్లో ఎన్ లక్ష్మీ చైతన్య మరియు షేక్. జైనాబ్ లు విజయం సాధించి గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు ఆ విద్యార్థులను అభినందిస్తూ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మస్తాన్ సాహెబ్,ఏపీ స్టేట్ ఆర్గనైజ సెక్రటరీ సయ్యద్ జుల్ఫికర్ అన్నమయ్య డిస్టిక్ ఇంచార్జ్ మహమ్మద్ అజీమ్ అన్నమయ్య డిస్టిక్ ప్రెసిడెంట్ అంకిపల్లి శివకుమార్
విద్యార్థినులకు శాలువాతో సన్మానించి మొమెంటో గోల్డ్ మెడల్ మరియు ఆంధ్ర రాష్ట్ర గౌరవ అవార్డు సర్టిఫికెట్ అందించడం జరిగినది.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ సాహెబ్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని నందలూరు మండలం అక్షర పబ్లిక్ స్కూల్ కు చెందిన ఎన్.లక్ష్మీ చైతన్య మరియు ఎస్.జైనాబ్ లు నేషనల్ స్థాయిలో ఎన్ఎస్ఐసి జరిపించిన కాంపిటేషన్లో బంగారు పతకాన్ని సాధించిన సందర్భంగా మన రాష్ట్రానికి గర్వకరంమని తెలియజేశారు. అనంతరం బాల్య వివాహాలు గురించి మాట్లాడుతూ బాల్యవివాహాలు చేసుకోవడంతోనే చిన్న వయసులో గర్భం దాల్చి రక్తహీనత ఏర్పడు తుందన్నారు. తద్వారా గర్భస్థ శిశువు బరువు, ఎత్తులలో తారతమ్యాలు ఏర్పడుతున్నాయన్నారు. సరైన సమయంలో వివాహాలు చేసు కోవడం,సరైన పౌష్టికాహారం తీసుకోవడంతోనే పిల్లలు ఆరోగ్యవంతంగా జన్మించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలా బాల్యవివాహాలు చుట్టుపక్క పరిసరాల్లో ఎక్కడైనా జరిగితే వారిని సంప్రదించాలని పిల్లలకు తెలియజేశారు.