

జనం న్యూస్ ఫిబ్రవరి 26 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ వివిధ ఉపాధ్యాయ సంఘాలు బలపర్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండారు నాగరాజు అన్నారు. మంగళవారం బరాఖత్ గూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం సంక్షేమంతో పాటు విద్యారంగా పటిష్టతకై నెలకొన్న వ్యవస్థ వల్ల మన వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో 2007 లో, 2013 లో, 2019 లో ఎన్నికలు జరిగాయాన్నారు.మళ్లీ ఇప్పుడు జరుగుతున్నాయని మరి ఈ మూడు సార్లు అనగా 18 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలు నెరవేర్చబడ్డాయని ఆలోచించాల్సిన అవసరత ఉపాధ్యాయుల పైన ఉందన్నారు. ఎవరైనా ఓటు వేసేటప్పుడు నేను వేసే ఓటు ద్వారా ఎన్నిక కాబడే వ్యక్తి నాకైనా ఉపయోగపడాలి లేదా నేను పనిచేసే వ్యవస్థ కైనా ఉపయోగపడాలని అనుకుంటాడు కానీ ఈ మూడు సార్లు మనం వేసిన ఓటు అలా మనకు ఏమైనా ఉపయోగించబడ్డదని ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. గెలిచిన వారి హోదా వారి ఆస్తులు సంపాదనకు ఉపయోగ పడ్డదా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయ సమస్యల పైన నిరంతరం పోరాడుతున్నటువంటి వ్యక్తి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించుకుంటే ఉపాధ్యాయ వ్యవస్థ బాగుపడుతుందని అన్నారు. సమావేశంలో గణేష్, పవన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.