

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన త్రికోటేశ్వర స్వామి భక్తులకు మిత్ర సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లో బుధవారం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్ర సర్వీస్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన కోటప్పకొండకు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారని ఆకలితో ఎటువంటి ఇబ్బందులు పడకూడదని, గత మూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామని, ఈ ఏడాదికి పలువురు దాతల సహాయ సహకారాలతో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తమకు సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్ర సర్వీస్ సొసైటీ సభ్యులు,పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.